కార్తికేయ 2లో అనుపమ ఫైనల్ ?

by Jakkula Samataha |
కార్తికేయ 2లో అనుపమ ఫైనల్ ?
X

కార్తికేయ… హీరో నిఖిల్ కెరియర్ లో నిలదొక్కుకునేలా చేసిన సినిమా. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సక్సెస్ తో నిఖిల్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కంటెంట్ ఉన్న కథలను నమ్ముతున్నాడన్న ముద్ర వేసి… మరిన్ని విభిన్న సినిమా స్క్రిప్ట్స్ తన దగ్గరికి వచ్చేలా చేశాడు. నిఖిల్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అనిపించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసాడు డైరెక్టర్. దేవాలయ రహస్యాల నేపథ్యంలో సాగే కథని మరింత కట్టుదిట్టంగా మలిచాడట. ఈ మధ్యే షూటింగ్ కూడా మొదలు కాగా… ఇందులో హీరోయిన్ గురించి చర్చ జరుగుతోంది. కార్తికేయలో చేసిన కలర్స్ స్వాతి మళ్లీ ఈ సినిమాలోనూ చేస్తుందని వార్తలు వచ్చాయి . నిజమే… సీక్వెల్ లోనూ స్వాతి చేస్తుందట. కానీ హీరోకు మాజీ లవర్ గా. మెయిన్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను సెలెక్ట్ చేశారట. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో తెరకెక్కుతుంది. ఈ సినిమా కనుక హిట్ కొడితే అనుపమకు అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం. ఇప్పటికే తమిళ్, కన్నడలో బిజీగా ఉన్న ఈ భామ… హిందీలో కూడా బిజీ అయిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. కాగా అనుపమ తెలుగులో దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో నటించబోతోంది. ఇప్పుడు కార్తికేయ 2 లో చాన్స్ కొట్టేసి… మళ్లీ తెలుగులో బిజీ అవుతోంది.

Tags : Anupama parameshwaran, Nikhil, colors Swathi, Karthikeya, Karthikeya 2

Advertisement

Next Story