Choksi : మెహుల్ చోక్సీ కోసం ఆంటిగ్వా పోలీసుల ముమ్మర గాలింపు

by Sumithra |   ( Updated:2021-05-26 06:40:13.0  )
Choksi : మెహుల్ చోక్సీ కోసం ఆంటిగ్వా పోలీసుల ముమ్మర గాలింపు
X

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఫ్రాడ్ కేసులో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ భారత్ నుంచి పారిపోయి కరీబియన్ దేశం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఆంటిగ్వాలో చోక్సీ ఆదివారం నుంచి అకాస్మాత్తుగా కనిపించికుండా పోయారు. దీంతో ఆ దేశ పోలీసులు ముమ్మర గాలింపులు ప్రారంభించారు. గ్లోబల్ అలర్ట్ కోసం ఇంటర్‌పోల్‌కూ విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు అధికారులు చోక్సీ బంధువులు, సన్నిహితులను ఆరా తీశారు. చివరిసారిగా ఆయన తన ఇంటి నుంచి కారులో వెళ్లినప్పుడు కనిపించారు. ఆ కారునూ అధికారులు రికవరీ చేసుకోగలిగారు. కానీ, చోక్సీ ఆచూకీ లభించలేదు. ఆయన ఆచూకీ కనిపిస్తే తెలియజేయాల్సిందిగా ప్రజలను బహిరంగంగా కోరుతున్నట్టు ఆంటిగ్వా, బార్బుడా పోలీసులు వెల్లడించారు.

చోక్సీ దేశం వదిలివెళ్లినట్టు తగిన ఆధారాలు కనిపించడం లేదని, బహుశా ఆయన దేశంలోనే ఉండి ఉండవచ్చునని ప్రధాని గెస్టన్ బ్రౌనీ పార్లమెంటులో పేర్కొన్నారు. చోక్సీ కుటుంబం ఆయన సడన్ మిస్సింగ్‌పై ఆందోళనలో ఉన్నారని, ఇన్వెస్టిగేషన్‌కు సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించారు. 2018లో పీఎన్‌బీలో ఫ్రాడ్‌కు పాల్పడ్డారన్న వార్తలు బయటకు రాకముందే నీరవ్ మోడీ, ఆయన మామ మెహుల్ చోక్సీలు దేశం దాటారు. ఫ్రాడ్‌తో తమకు సంబంధం లేదని, తాము అమాయకులమని పలుమార్లు వారు ప్రకటనలు చేశారు. నీరవ్ మోడీ లండన్‌లో 2019లో అరెస్టయ్యారు.

Advertisement

Next Story

Most Viewed