‘యాంటిజెన్’ టార్గెట్ 7,250.. చేసింది 3,667

by  |
‘యాంటిజెన్’ టార్గెట్ 7,250.. చేసింది 3,667
X

ప్రభుత్వ డాబులు.. వైద్యాధికారుల చిత్తశుద్ధిని ఆదివారం చేపట్టిన కరోనా పరీక్షల సంఖ్య తేటతెల్లం చేస్తున్నాయి. నగరంలోని ఆయా దవాఖానాల్లో 7,250 పరీక్షలు చేయాలనేది లక్ష్యం కాగా కేవలం 3,667 టెస్టులు చేసి మమా అనిపించారు. మరి అధికార పార్టీ ప్రతినిధులైతే మేమే గొప్పా.. ఇంకే రాష్ట్రంలో మనన్నీ చేయడం లేదు. మా అంత కష్టపడి ఎవరూ పని చేయడం లేదంటూ మైకు ముందు గొప్పలు ఊదరగొడుతుంటారు. నగరంలో 106 పట్టణ ప్రాథమిక, ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇందులో 36 దవాఖానాల్లో ఆదివారం ఒక్కటంటే ఒక్క పరీక్ష కూడా చేయలేదు.

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు, వైరస్​బారిన పడిన వారిని గుర్తించేందుకు నగరంలోని యూపీహెచ్​సీ, బస్తీ దవాఖానాల్లో విస్తృతంగా ‘యాంటిజెన్’ పరీక్షలు పరీక్షలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వాటిల్లో పని చేస్తున్న వైద్యులకు టెస్టుల టార్గెట్ ఇచ్చినప్పటికీ కొన్ని హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది ఒక్క పరీక్ష కూడా చేయలేదు.

చందులాల్ బార్దారి, తీగలకుంట , జహనుమా, చార్మినార్, అలియాబాద్, పంజేషా 1, నయాపూల్, తారా మైదాన్, కామటిపురా, పంజేషా 2, జాంబాగ్ పార్కు, తిలక్ నగర్, అఫ్జల్ సాగర్, చింతల్ బస్తీ, సయీద్ నగర్, నాంపల్లి, నిలోఫర్, ఆగాపురా, శాంతినగర్, ఖైరతాబాద్, ఆర్ఎఫ్ పీటీసీ, అమీర్ పేట్, సనత్ నగర్, పంజాగుట్ట, బైబిల్ హౌస్, సరోజిని ఐ హాస్పిటల్, ప్రభుత్వ నిమామియా తిబ్బి హాస్పిటల్, ఏహెచ్ మలక్ పేట్, ఏహెచ్ నాంపల్లి, ఏహెచ్ గోల్కొండ, సూరజ్ భాన్ మెటర్నిటీ హాస్పిటల్, సీహెచ్​సీ బార్కాస్, యూసీహెచ్​సీ అంబర్ పేట్, యూసీహెచ్​సీ డబీర్ పురా, యూసీహెచ్​సీ పానిపురా, యూసీహెచ్​సీ సీతాఫల్ మండి హాస్పిటల్స్ లో ఆదివారం 2,160 పరీక్షలు చేయాల్సి ఉండగా.. ఒక్క పరీక్ష కూడా చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే కొన్ని ఆస్పత్రుల్లో టార్గెట్ ను మించి చేయగా అధిక శాతం హాస్పిటల్స్ లో నిర్ధేశించిన లక్ష్యంలో 60 శాతం లోపుతోనే సరి పెట్టుకున్నారు.

జూలై 9 నుంచి..

మహానగరంలో కరోనా కేసుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జూలై 9 వ తేదీ నుంచి నగరంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ డీఎం అండ్ హెచ్ఓ పరిధిలో మొత్తం 85 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా వీటికి బస్తీ దవాఖానలు తోడయ్యాయి. ఆర్ టీ పీసీఆర్ పరీక్షలు చేపట్టిన స్వల్ప వ్యవధి లోనే రోగికి కరోనా ఉన్నది, లేనిది నిర్ధారించవచ్చు. దీనికి తోడు నగరంలో ఏ ప్రాంతంలో నివాసముంటున్న వారైనా వారి సమీపంలోని యూపీహెచ్​సీ, బస్తీ దవాఖానాల్లోనే పరీక్షలు చేయించుకునే అవకాశం అధికారులు కల్పించారు.

రెండు లక్షలకు చేరువలో టెస్టులు..

జూలై 9వ తేదీ నుంచి నగరంలోని యూపీహెచ్ సీ, బస్తీ దవాఖానాల్లో చేపడుతున్న ఆర్ టీ పీసీఆర్ పరీక్షలు ఆగస్టు 30వ తేదీ నాటికి 1,89,884 చేరుకున్నాయి. వీటిల్లో 24, 227 మందికి పాజిటివ్ రాగా 1,65, 657 మందికి నెగెటివ్ అని తేలింది. మొత్తం 13 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


Next Story

Most Viewed