- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరవరరావు విడుదలకు సహకరించండి
దిశ, న్యూస్‌బ్యూరో: సుప్రసిద్ధ కవి పెండ్యాల వరవరరావు మహారాష్ట్ర ముంబైలోని తలోజ జైలులో తీవ్ర అనారోగ్యంతో ఉన్నందున వారిని వెంటనే తగిన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి, అతని ప్రాణాలు కాపాడాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. తలోజ జైలులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుతో ఆయన సహచరి హేమలత శనివారం మాట్లాడారని, ఆయన మాటలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక విషయానికి మరో విషయం పొంతన లేకుండా ఉన్నదని, మాట ముద్దగా వస్తున్నదని, ఆమె చాలా దుఃఖంతో ఈ విషయాన్ని తెలియజేశారని ఆ లేఖలో హరగోపాల్ ప్రస్తావించారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై మొత్తం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు.
ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోక్యం కల్పించుకొని, తగిన చికిత్స కోసం చొరవ తీసుకోవాలని కోరారు. ఆయన ఆరోగ్యం, ప్రాణాలు కాపాడటం కోసం వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి బెయిల్‌పై విడుదలై తిరిగి కుటుంబంతో కలిసి ఉండి, సరైన చికిత్స పొందే విధంగా తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు సమాజంలోని సాహితీ మిత్రులు, ప్రజాస్వామికవాదుల ఆందోళనను తగ్గించేలా చొరవ తీసుకుంటారని హరగోపాల్ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.