- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్బంధ శిబిరానికి వెళ్తా: రాజస్థాన్ సీఎం
పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనకారులకు రాజస్థాన్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, నిర్బంధ కేంద్రాలకు ఎవరైనా వెళ్లాల్సి వస్తే ముందు తామే వెళ్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) వివరాల నమోదులో భాగంగా తల్లిదండ్రులు ఎక్కడ జన్మించారు అనే విషయమై సమాచారం సేకరించబోతున్నారు. నా తల్లిదండ్రుల జన్మస్థలాల వివరాలను ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. ఇందుకు పర్యవసానంగా నన్ను నిర్బంధ శిబిరానికి తరలించవచ్చు. మీరు ఒక్క విషయం నమ్మండి. అలాంటి పరిస్థితే తలెత్తితే నిర్బంధ శిబిరానికి వెళ్లే వారిలో నేనే మందు వరుసలో ఉంటాను’ అని ఆయన స్పష్టం చేశారు. జైపూర్‌లో సీఏఏకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మద్దతు ప్రకటించారు. జైపూర్ ఆందోళనల ప్రాంతాన్ని రాజస్థాన్ షాహిన్‌బాగ్‌గా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకువచ్చిన సీఏఏను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. దేశంలో శాంతి, సామరస్యం స్థాపించాలని కోరారు. జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీఏ)ను అసోంలో అమలు చేయడానికి అక్కడి బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆరోపించారు. చట్టాలు చేయడానికి ప్రభుత్వాలకు హక్కు ఉంటుందని కానీ, ప్రజల మనోభావాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఢిల్లీలోని షాహిన్‌బాగ్ వంటి ఆందోళనలు దేశవ్యాప్తంగా జరగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని సూచించారు.
- Tags
- ashok-gehlot
- CAA