తారక్ సినిమాలో ‘మన్మథుడు’ హీరోయిన్

by Shyam |
తారక్ సినిమాలో ‘మన్మథుడు’ హీరోయిన్
X

దిశ, సినిమా : ప్రభాస్ ‘రాఘవేంద్ర’, నాగార్జున ‘మన్మథుడు’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అన్షు.. చివరగా భూమికా చావ్లా ‘మిస్సమ్మ’లో అతిథి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది భామ.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోందని సమాచారం. పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మిస్తుండగా.. త్రివిక్రమ్ అన్షుకు కీ రోల్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story