చైనాలో "టిక్" ద్వారా ప్రాణాంతక వ్యాధి 

by  |
చైనాలో టిక్ ద్వారా ప్రాణాంతక వ్యాధి 
X

దిశ, వెబ్ డెస్క్: చైనాలో ఒకటి తర్వాత మరొకటిగా వైరస్ లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో చైనా నుండి ఎప్పుడు ఏ మహమ్మారి ప్రపంచంపైకి విరుచుకుపడుతుందో అని వణికిపోతున్నారు జనాలు. టిక్ అనే పురుగు ద్వారా ఎస్ ఎఫ్ టీ ఎస్ (నావెల్ బునియా) వ్యాధి మనుషులకు సోకుతోంది.

కరోనా తర్వాత అంతటి ప్రమాదకర స్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తోందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఈ వ్యాధి సోకి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 60 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.

“టిక్” (నల్లి పురుగు లాంటిది) అనే పురుగు నుండి మనుషులకు తరువాత ఒకరి నుండి మరొకరికి ఈ వైరస్ వ్యాపిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలున్న కారణంగా ఇతర దేశాలకు వ్యాపించకపోవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story