- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షాద్‌నగర్‌లో తాజాగా రెండు కేసులు
by vinod kumar |

X
దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్‌లో శనివారం రెండు కరోనా కేసులు వెలుగు చూశాయి. పట్టణంలోని లక్ష్మీ నరసింహ కాలనీలో ఓ వ్యక్తికి, క్రిస్టియన్ కాలనీలో మరో వ్యక్తికి కోవిడ్-19 సోకింది. ఇటీవల క్రిస్టియన్ కాలనీకి చెందిన వ్యక్తి అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే అతనికి ఆరోగ్యం కుదుట పడలేదు. ఇంతలోనే తన సోదరుడికి గుండె స్టంట్ ఆపరేషన్ చేయడంతో హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో క్రిస్టియన్ కాలనీలో ర్యాపిడ్ యాక్షన్ టీం బృందం పర్యటించి పాజిటివ్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తుంది.
Next Story