తెలంగాణ ఈఎస్ఐ స్కామ్‌లో మరో ట్విస్ట్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఈఎస్ఐ స్కామ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో బంజారాహిల్స్‌లో మంగళవారం దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ.4కోట్ల నగదును సీజ్ చేశారు. కమర్షియల్ ప్రాపర్టీ కొనేందుకు దేవికారాణి, నాగలక్ష్మి కలిసి రూ.4కోట్ల నగదును బిల్డర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. బెయిల్‌పై విడుదలయ్యాకే నగదును దేవికారాణి… బిల్డర్‌కు ఇచ్చినట్లు పక్కా సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. అయితే ఈ సొమ్మంతా ఈఎస్ఐ స్కామ్‌లోనే దోచుకున్నదేనని అనుమానిస్తున్నారు.

Advertisement