మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని ఓ సీనియర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ సోకినట్టు ఆ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీతోనే ఉన్న ఈ ఎమ్మెల్యే గత టర్మ్‌లో మంత్రి కూాడా పనిచేశారు. ఇటీవల జరిగిన హరితహారం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఈ ఎమ్మెల్యే పలువురు కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగారు. రెండు రోజుల నుంచి కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్న సదరు ఎమ్మెల్యేకు పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. అదే విధంగా ఆయన కుమారుడికి కూడా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. మిగతా ఆయన కుటుంబసభ్యులకు నెగిటివ్ రాగా వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచించారు. కాగా ఇప్పటికే టీఆర్ఎస్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలకు రాగా, హోం మంత్రి మహమూద్ అలీ కూడా కరోనా వచ్చింది. దీంతో మొత్తం కరోనా బారిన పడిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుగురికి చేరింది. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టింది. రానున్న కాలంలో ఇంకెంత మంది కరోనా బారిన పడతారో అని నాయకుల్లో ఆందోళన మొదలైంది.

Advertisement