- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కీసర ఏసీబీ కేసులో మరో ఆత్మహత్య..
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడిన కీసర తహసీల్దార్ నాగరాజు జైలులోనే ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనను ఇంకా ఎవరూ మరువక ముందే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల బెయిల్‌పై విడుదలైన ధర్మారెడ్డి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ధర్మారెడ్డి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story