సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నాను: రియా

by Shamantha N |   ( Updated:2020-09-06 07:44:44.0  )
సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నాను: రియా
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో మరో సంచలనం వెలుగుచూసింది. ఇదే కేసులో డ్రగ్స్‌ వ్యవహారం బయటపడడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రియా చక్రవర్తిని విచారించిన అధికారులు సంచలన నిజాలు రాబట్టారు.

అయితే, విచారణలో డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్టు రియా చక్రవర్తి ఒప్పుకుంది. అది కూడా సుశాంత్ కోసమే అని స్పష్టం చేసింది. సోదరుడు షోవిక్, మిరండాల ద్వారా డ్రగ్స్‌ను కొనుకోలు చేసినట్టు రియా వెల్లడించింది. దీంతో అధికారులు రేపు మరోసారి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. దీంతో కేసు మరో మలుపు తిరిగినట్టు అయింది.

Advertisement

Next Story