పాతబస్తీలో మరో రౌడీషీటర్ హత్య

by Sumithra |
murder
X

దిశ, క్రైమ్ బ్యూరో: పాతబస్తీలో మరో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లోని ముస్తఫా నగర్‌కు చెందిన మహమ్మద్ జాబేర్‌ను ఫలక్‌నూమా పీఎస్ పరిధిలోని అన్సారీ రోడ్డులో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. స్థానికులు జాబెర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. జులై నెలలో కాలాపత్తర్ పీఎస్ పరిధిలో జరిగిన శానూర్ ఖాజీ హత్య కేసులో జుబేర్ నిందితుడని పోలీసులు వెల్లడించారు. దీంతో ఖాజీ మనుషులే హత్య చేసినట్లు భావిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ ఎంఏ మాజీద్ తెలిపారు.

Advertisement

Next Story