నల్లగొండ జిల్లాలో తాజాగా మరో కేసు

by vinod kumar |
నల్లగొండ జిల్లాలో తాజాగా మరో కేసు
X

దిశ, నల్లగొండ: జిల్లాలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైంది. తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన ఓ యువకుడికి అనారోగ్యం కారణంగా మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు తరలించారు. కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆదివారం రాత్రి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన యువకుడి సోదరుడికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఆ మరుసటి రోజు గ్రామంలో ఉప్పలమ్మ పండుగ జరగడంతో భారీగా బంధువులు, గ్రామస్తులు హాజరయ్యారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకొని ఇళ్ల నుంచి బయటికి ఎవరు రావద్దని సూచనలు చేశారు. ఆరోగ్య సిబ్బంది కరోనా పాజిటివ్ వ్యక్తి కాంటాక్ట్స్‌ను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed