- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృత లాంగ్వేజ్‌ను ప్రవేశపెట్టాలన్న అంశాలపై ఇంటర్ విద్యా కమిషన్ వెనక్కి తగ్గింది. సంస్కృతాన్ని ప్రవేశపెట్టబోమని నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులపై సంతకం చేశారు. విద్యార్థులకు అసౌకర్యంగా ఉండే విధానాలను ప్రవేశపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై తెలుగు భాషను ప్రోత్సహించే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఇంటర్ మీడియట్ విద్యలో రెండో భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా పలు సంస్కృత భాషాపండింతుల నుంచి ఉపాధ్యాయల నుంచి ఇంటర్ విద్యా కమిషన్ కు నివేదికలు అందాయి. కేవలం ప్రైవేటు జూనియర్ కళాశాలలో అమలులో ఉన్న సంస్కృత లాంగ్వేజ్ ను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అమలు చేయాలని కోరారు. వీటిని పరిశీలించిన ఇంటర్ కమిషన్ అభిప్రాయాలు సేకరించి నివేదికలు పంపించాల్సిందిగా కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు.
సంస్కృతంపై వెల్లువెత్తిన నిరసనలు
సంస్కృత లాగ్వేజ్‌ను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశపెట్టడానికి జరుగుతున్న కార్యక్రమాలపై తెలుగు భాషా పండితుల నుంచి, తెలుగు ఉపాధ్యాయుల వరకు నిరసలు వెల్లువెత్తాయి. తెలుగు స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. తెలుగు భాష అభివృద్ధికి పాటుపడాల్సిన ఇంటర్ విద్యాకమిషన్ ఇతర భాషలను ప్రోత్సహిస్తుందని ఆగ్రహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలులోని సంస్కృతాన్ని జూనియర్ కళాశాలలో ఎలా ప్రవేశపెడుతారని ప్రశ్నించారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్ మీడియట్ విద్యా పరిరక్షణ సమితి పలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
వెనక్కి తగ్గిన ఇంటర్ కమిషన్
రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృత భాష ప్రవేశపై నిరసనలు వెల్లువెత్తడంతో ఇంటర్ విద్యా కమిషన్ వెనక్కు తగ్గింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృత భాషను ప్రవేశపెట్టబోమని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ సంతకం చేసినట్టుగా సమాచారం.
తెలుగు భాషను అభివృద్ధి పరచాలి
తెలుగు భాషను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు చేపట్టాలి. ఇంగ్లిషు మాద్యమ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో తెలుగును కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంస్కృత భాషను ప్రవేశపెడుతామనడం సమంజసం కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నిర్ణయాన్ని ఒప్పుకోం.
-రామకృష్ణ, తెలంగాణ ఇంటర్ మీడియట్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్