- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లగొండలో మరో నలుగురికి పాజిటివ్
దిశ, నల్లగొండ: జిల్లాలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు డీఎంహెచ్‌వో కొండల్‌రావు తెలిపారు. అయితే, ఈ నలుగురూ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చి కరోనా బారిన పడ్డ వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులేనని వెల్లడించారు. నల్లగొండ జిల్లా నుంచి మర్కజ్‌లో జరిగిన ప్రార్ధనలకు వెళ్లొచ్చిన 44 మందిని క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. వీరిలో కరోనా నిర్ధారణ అయినవారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అలాగే, నల్లగొండ మసీదులో ప్రార్ధనలకు వచ్చిన 15మంది బర్మా దేశస్థుల్లో ఇద్దరికి కరోనా సోకిందన్నారు. కాగా, తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో జిల్లాలో కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య 14కు చేరినట్టు వివరించారు. కరోనా పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న మరికొందరి రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్‌కు పంపించామనీ, వారి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. అలాగే, నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం 40 మంది ఐసొలేషన్‌లో ఉండగా, మహత్మాగాంధీ యూనివర్శిటీలోని క్వారంటైన్‌లో 64 మంది ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఇంకా రెండో దశలోనే ఉన్నదనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
tags: nalgonda, positive cases, corona cases in nalgonda, DMHO kondal rao, virus, covid-19, mg university, isolation,