నిర్మల్‌లో కానిస్టేబుల్‌తోపాటు మరో ముగ్గురికి కరోనా

దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో తాజాగా నలుగురికి కరోనా సోకింది. 12 మంది అనుమానితుల నుంచి నమూనాలను సేకరించగా నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిలో భైంసాకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్, నిర్మల్ కు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు 12 ఏళ్ల బాలుడు ఉండడం గమనార్హం.

Advertisement