ఎన్440 వైరస్ వివాదం.. చంద్రబాబుపై మరోసారి ఫిర్యాదు

by srinivas |
ఎన్440 వైరస్ వివాదం.. చంద్రబాబుపై మరోసారి ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్440 కరోనా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆయనపై ఇప్పటికే ఫిర్యాదులు చేయగా కేసు నమోదు కావడం ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా, మరోసారి చంద్రబాబుపై ఇదే విషయంలో కృష్ణా జిల్లా మైలవరం పోలీసులకు ఫిర్యాదు అందింది. మైలవరం ప్రాంతానికి ఓర్సు శ్రీనివాస రావు, పజ్జూరు సాంబశివరావులు(న్యాయవాదులు) శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైరస్ పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. కాగా, దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్న విషయంపై సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story