శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో మళ్లీ ప్రమాదం?

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని ప్రమాదాలు వదలడం లేదు. తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. కరెంట్ కేబుల్ పై నుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ప్రమాదం జరిగింది. దీంతో భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడటంతో ప్లాంట్ సిబ్బంది మొత్తం పరుగులు తీసింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనట్లు తెలుస్తోంది. 20రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో 9మంది చనిపోయిన విషయం తెలిసిందే.

కాగా విద్యుత్ కేంద్రంలో ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించారు. కేవలం మాక్ డ్రిల్ మాత్రమే చేశామని చెప్పారు. ప్రమాదాలు జరిగితే ఎలా బయటకు వెళ్లాలి, ఎలా నివారించేందుకు ఇలా సిబ్బందికి అవగాహన కల్పించామని అధికారులు చెబుతున్నారు.

Advertisement