- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో 351 కొత్త కేసులు.. ఇద్దరు మృతి

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా, 15,188 శాంపిళ్లను పరీక్షించగా, అత్యధికంగా 351మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో 275 మంది ఏపీ వాసులుండగా, 76మంది ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చినవారున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,071కు చేరింది. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 5,555మంది ఉండగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు 263మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,253మంది ఉన్నారు.
మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం ఉదయం 9గంటల వరకు 55మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,906కి పెరిగింది. వైరస్ బారినపడి కొత్తగా కర్నూల్ జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 90కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,559 యాక్టివ్ కేసులున్నాయి.