‘అన్నాత్తే’ ఫస్ట్ సింగిల్.. దుమ్ములేపిన ఎస్‌పీ బాలు

by Shyam |
Rajani Balu
X

దిశ, సినిమా : సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ ఫిల్మ్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రంలో నయనతార, కుష్బూ, మీనా, కీర్తి సురేష్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. దివంగత గాయకుడు ఎస్‌పీ బాలు పాడిన పాట మాస్ బీట్‌తో దుమ్ములేపుతోంది. ‘అన్నాత్తే.. అన్నాత్తే’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో రజినీ స్టైలిష్ లుక్స్, మేనరిజమ్స్‌ను ఫ్యాన్స్‌ ఎంజాయ్ చేస్తున్నారు. పంచకట్టు, కూలింగ్ గ్లాసెస్‌తో కూల్‌గా కనిపించిన రజనీ.. తన రెగ్యులర్ గ్రేస్‌ను కంటిన్యూ చేశాడు. ఇక ఈ పాట విడుదలైన క్షణాల్లోనే వైరల్‌గా మారగా.. డి ఇమాన్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. సన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రానికి స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించగా.. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ అందించారు. కాగా ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Advertisement

Next Story