- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంకిత్ చవాన్‌పై ముగిసిన నిషేధం
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013 సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కేసులో దేశవాళీ క్రికెటర్ అంకిత్ చవాన్‌పై ఏడేళ్ల నిషేధం పూర్తయ్యింది. అప్పట్లో శ్రీశాంత్‌తో కలసి ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇద్దరిపై జీవితకాలం నిషేధం విధించారు. అయితే శ్రీశాంత్ పలు కోర్టుల చుట్టూ తిరిగి శిక్షా కాలాన్ని 7 ఏళ్లకు తగ్గించుకున్నాడు. అంకిత్ చవాన్‌పై నిషేధాన్ని కూడా 7 ఏళ్లకు తగ్గించడంతో గత ఏడాది సెప్టెంబర్‌లోనే నిషేధం ముగిసింది. అయితే అప్పటి నుంచి బీసీసీఐ నుంచి ఉత్తర్వులు అందలేదు. దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అతడు ముంబై క్రికెట్ అసోసియేషన్‌ను కోరాడు. కాగా, తనకు బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్ నుంచి ఈ-మెయిల్ అందిందని.. తనపై విధించిన నిషేధం 2020 సెప్టెంబర్ 13తోముగిసినట్లు పేర్కొన్నారని చవాన్ చెప్పాడు. గత ఏడాది నుంచి క్లియరెన్స్ రాకపోవడంతోనే తాను క్రికెట్ ఆడలేదని చెప్పాడు. ఇక ఇప్పుడు నాకు క్లియరెన్స్ వచ్చినందున క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.