బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

by Shyam |
బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్
X

మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలంతా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అనిల్ ఎఫ్‌3 సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఎఫ్‌2కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌తోపాటు మరో హీరోను కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయి.

ఎప్పటి నుంచో నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయాలనుకుంటున్న అనిల్ రావిపూడి.. అందుకు తగిన కథ సిద్ధం చేశాడట. లాక్‌డౌన్ పూర్తి కాగానే బాలయ్యకు కథ వినిపించి.. ఒప్పించాలనే పట్టుదలతో ఉన్నాడట. ఈ ప్రాజెక్టుకు గనుక బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. నందమూరి ఫ్యాన్స్‌కు పండగే. 100% ఎంటర్‌టైన్మెంట్ పక్కా అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.

కాగా బాలయ్య ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్‌లో సినిమా చేస్తుండగా.. రానాతో కలిసి “అయ్యప్పనుమ్ కోషియుమ్” చిత్రాన్ని కూడా రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed