- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఐపీఎల్‌పై కుంబ్లే కామెంట్ ఇదీ!

దిశ, స్పోర్ట్స్ :
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది జరుగుతుందని అనిల్ కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశాడు. టీం ఇండియా మాజీ కెప్టెన్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు హెడ్ కోచ్ అయిన కుంబ్లే తాజాగా స్టార్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న ‘క్రికెట్ కనెక్టెడ్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలసింది. ఆ విషయం అధికారికంగా మాకు ఇంకా తెలియదు. కానీ కరోనా కారణంగా వాయిదా పడ్డ 13వ సీజన్ ఈ ఏడాదిలోనే జరగడం మంచిదని కుంబ్లే అన్నాడు. ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించాలనకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో సరైన నిర్ణయమేనని.. అదే జరిగితే ముడు నాలుగు వేదికల్లోనే టోర్నీ మొత్తం నిర్వహించవచ్చని కుంబ్లే చెప్పాడు. అలా చేయడం వల్ల ఆటగాళ్లు నిరంతరం ప్రయాణించాల్సిన అవసరం కూడా ఉండదని కుంబ్లే చెప్పాడు.