ప్రిన్స్‌కు విలన్‌గా అనిల్ కపూర్?

by Jakkula Samataha |
ప్రిన్స్‌కు విలన్‌గా అనిల్ కపూర్?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త చిత్రం ‘సర్కార్ వారి పాట’. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అదిరిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేశ్ అని ఇప్పటికే ప్రకటించారు. కాగా, సినిమాలో విలన్ రోల్‌ను పవర్‌ఫుల్‌గా ప్లాన్ చేసిన మూవీ టీమ్.. ఇందుకోసం బాలీవుడ్ సీనియర్ హీరోను సెలెక్ట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

సూపర్ మోస్ట్ టాలెంటెడ్ హీరో అనిల్ కపూర్‌ను ‘సర్కార్ వారి పాట’ విలన్‌గా సెట్ చేయడానికి పరశురాం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ కపూర్‌ను కలిసి స్టోరీ కూడా వినిపించగా.. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్న డైరెక్టర్.. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి ఆర్టిస్టులను సెలక్ట్ చేస్తే సినిమాకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story