- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి వేదాంత గ్రూప్ పెట్టుబడులు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వేదాంత గ్రూప్ సంస్థ రాబోయే మూడేళ్లకు భారత్‌లో చిప్‌ల తయారీ కోసం భారీగా పెట్టుబడులను ప్రకటించింది. అధునాతన చిప్‌లతో పాటు గ్లాస్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కంపెనీ మొత్తం రూ. 60,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల కేంద్రం దేశంలో సెమీకండక్టర్ల పెట్టుబడులకు భారీ ప్రోత్సాహక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనికోసం సంస్థ అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ, ఈక్విటీ భాగస్వాములతో చర్చిస్తోందని, దిగ్గజ ఫ్యాబ్రికేషన్ తయారీదారులతో జాయింట్ వెంచర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా దాదాపు 250-400 ఎకరాల్లో కావాల్సిన ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కంపెనీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోందని, ఇది చివరి దశలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ కోసం వేదాంత గ్రూప్ రూ. 45,000 కోట్ల నుంచి రూ. 60,000 కోట్ల మధ్య పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రోత్సాహకాల కోసం ప్రస్తుతం తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలతో కంపెనీ చర్చలు జరుపుతోంది. ఇది కాకుండా పెట్టుబడి పెట్టే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కాకుండా అదనంగా 10-15 శాతం మూలధన మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్టు కంపెనీ వివరించింది.