- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆండ్రాయిడ్ టీవీ యూజర్లు ఇది ‘ట్రై’ చేశారా?
దిశ, వెబ్‌డెస్క్ :
స్మార్ట్ టీవీ వాడుతున్నారా? ఆండ్రాయిడ్ టీవీ వినియోగదారులా? అయితే గూగుల్ మీకోసం ఓ సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. అదేంటంటే సాధారణంగా ఓ గేమ్ లేదా యాప్ గురించి ఎవరో చెప్పగానే వెంటనే దాన్ని డౌన్‌లోడ్ చేసేస్తుంటాం. తీరా డౌన్‌లోడ్ చేసి, ఆ గేమ్ లేదా యాప్‌ను వాడాక.. బాగాలేదని తెగ ఫీలై పోతాం, డేటా కూడా వేస్ట్ అయిపోతోంది. అందుకే సదరు యాప్ లేదా గేమ్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే ఓసారి ట్రై చేస్తే? భలే ఉంటుంది కదా? ఇప్పుడు అదే కోవలో గూగుల్ ప్లే.. ఇన్‌స్టంట్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఆండ్రాయిడ్ టీవీలో ఏవైనా యాప్స్ వాడాలంటే ఇకపై డౌన్‌లోడ్ చేయకుండానే యాప్స్, కొత్త గేమ్స్ ట్రై చేయొచ్చు. ఆ యాప్ లేదా గేమ్ ఎలా ఉందో టెస్ట్ చేసేందుకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడనుంది. గూగుల్ 2017లోనే ఈ ఫీచర్‌ను స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే ట్రై చేయొచ్చు. ట్రై చేసిన తర్వాత ఆ యాప్ తమకు ఉపయోగపడుతుందని అనుకుంటేనే డౌన్‌లోడ్ చేయొచ్చు. కాగా, ఇప్పుడు ఇదే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది గూగుల్. యాప్ లేదా గేమ్ ఓపెన్ చేయగానే ఇన్‌స్టాల్ ఆప్షన్ పక్కన ఉండే ‘ట్రై నౌ’ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.