- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP Politics:బొత్స నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ డుమ్మా..!?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు (సోమవారం) వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ మేరకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్ కార్యక్రమానికి పలువురు వైసీపీ కీలక నేతలు హాజరయ్యారు. కానీ ఉత్తరాంధ్ర జిల్లా ఇంచార్జ్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే విశాఖలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాకపోవడం పై పార్టీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నాయి. దీనికి తోడు జిల్లా కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ వరకు వచ్చినట్లే వచ్చి వైవీ సుబ్బారెడ్డి వెనుదిరిగి పోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో పలు అనుమానాలు జిల్లా నేతలతో పాటు పార్టీ నేతలందరికీ వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఎందుకిలా ప్రవర్తించారు..? ఆయనకు ఏమైంది..? బొత్స పోటీ చేయడం ఇష్టం లేదా..? లేకుంటే బొత్స, సుబ్బారెడ్డికి పడట్లేదా..? అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.