Kadapa: ఎంపీ అవినాశ్ రెడ్డిపై వీరాభిమానం.. శబరిమల వెళ్లి మరీ ఏం చేశాడంటే..

by srinivas |
Kadapa: ఎంపీ అవినాశ్ రెడ్డిపై వీరాభిమానం.. శబరిమల వెళ్లి మరీ ఏం చేశాడంటే..
X

దిశ, కడప: కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డికి కేసుల నుంచి విముక్తి లభించాలంటూ పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బండి శ్రీనివాసులరెడ్డి శబరిమలలో అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలోని తాంత్రిలతో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల మంచి కోసం ప్రతినిత్యం పాటుపడే ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రమేయం లేని కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేయడం బాధకరమన్నారు. కేసుల పేరుతో నిత్యం విచారణలు, కోర్టుల చుట్టూ తిప్పడంతో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తుండగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా పులివెందుల, కడప జిల్లాను అభివృద్ధి పథంలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అయ్యప్ప అశీస్సులతో త్వరలోనే ఎంపీ అవినాష్ రెడ్డి , వైఎస్ భాస్కర్ రెడ్డికి అంతా మంచి జరుగుతుందని బండి శ్రీనివాసుల తెలిపారు.

Advertisement

Next Story