Kadapa: ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం

by srinivas |
Kadapa: ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం
X

దిశ, కడప: కడప రిమ్స్ హాస్పిటల్ రహదారిలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులు చెన్నూరు మండలం చిన్న మాచు పల్లె చెందిన యాకోబ్ (35), కడప కాగితాల పెంటకు చెందిన షేక్. ముబారక్ (24)లుగా గుర్తించారు. టిప్పర్ రిమ్స్ నుంచి మట్టితో కడపకు వస్తుండగా శివానందపురం సమీపంలోని బొరుగుల ఫ్యాక్టరీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందిన యాకోబు చెల్లెలు అనారోగ్యంతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో యాకోబు మరో డ్రైవర్ ముబారక్‌తో కలిసి హాస్పిటల్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story