16న సీఎం జగన్ పర్యటన..అక్కడే అభ్యర్థుల తుది జాబితా రిలీజ్

by Jakkula Mamatha |
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
X

దిశ ప్రతినిధి,కడప:రాబోయే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల అధ్యక్షులు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు.YSRCP అధ్యక్షులు,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీన వేంపల్లె మండలం ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి వైఎస్సార్ కు ఘనంగా నివాళులర్పిస్తారు. అనంతరం వైఎస్సార్ ఘాట్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.ఇప్పటికే చిన్నచిన్న మార్పులతో అభ్యర్థుల జాబితా సిద్దం అయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడ జగన్ ఇడుపులపాయ నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది.

ఈ సారి కూడా అక్కడ నుంచే అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు ఇడుపులపాయలో ఏర్పాట్లు చేపట్టారు.అదే రోజు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఎన్నికల ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెడుతారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టి అదే రోజు విజయవాడ వెస్ట్ ,నెల్లూరు రూరల్ లో ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు.రోజుకు రెండు లేదా మూడు బహిరంగ సభలో, రోడ్ షో లో జగన్ పాల్గొనే విధంగా రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు తెలిసింది.

Read More..

వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అక్కడి నుంచే ప్రకటన

వైసీపీ ఫెనల్ లిస్ట్ ముహూర్తం ఫిక్స్.. మేనిఫెస్టో కూడా అక్కడే అనౌన్స్ చేసే చాన్స్!

Advertisement

Next Story

Most Viewed