ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి మళ్లీ నోటీసులు

by srinivas |
ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి మళ్లీ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి(MP Avinash Reddy PA Raghava Reddy)కి పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని సూచించారు. సోషల్ మీడియా(Social Media)లో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ఇప్పటికే ఆయనను పులివెందుల పోలీస్ స్టేషన్‌(Pulivendula Police Station)లో విచారించారు. డీఎస్పీ మురళీ నాయక్(DSP Murali Naik) ఆధ్వర్యంలో రాఘవరెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. అసభ్య పోస్టుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది. ఎందుకు పోస్టులు పెట్టారనే విషయాలపై విచారించారు. విచారణ ముగియడంతో మరోసారి హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed