Kakinada: ద్వారంపూడి ఇంట్లో అందరూ గూండాలే.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2023-06-18 14:53:18.0  )
Kakinada: ద్వారంపూడి ఇంట్లో అందరూ గూండాలే.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కాకినాడలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీ స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓడిపోయానని పదే పదే ద్వారంపూడి అంటున్నారని.. ఆయన నోటి దూల ఎక్కువైందని మండిపడ్డారు. డెకాయిట్ ద్వారం పూడికి బుద్ధి చెప్పడానికి తాను వచ్చినట్లు తెలిపారు. అధికారం ఉందనే అహంకారంతోనే నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ద్వారంపూడి ఇంట్లో అందరూ గుండాలేనని పవన్ వ్యాఖ్యానించారు. ద్వారంపూడి కుటుంబ సభ్యులు గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చారని ఆరోపించారు. కాపు మహిళలను కాపు రౌడీలతో కొట్టించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్రిమినల్స్‌కు సీఎం జగన్ అండగా ఉన్నారని పవన్ ఆరోపించారు. సీఎం జగన్ ఓ దోపిడీ దారుడని, నేరస్తుడని పవన్ వ్యాఖ్యానించారు. నాయకుడు సరిగా లేకపోతే పాలన అస్తవ్యవస్తమవుతుందన్నారు. కాకినాడ జనవాణిలో సమస్యలు వింటే బాధ కలగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లోనే తాను పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి ఉంటే వైఎస్ జగన్ ను రానిచ్చేవాడిని కాదని పవన్ తెలిపారు.

Advertisement

Next Story