Kadapa: హాస్టల్ వార్డెన్ భర్త‌కు దేహశుద్ధి.. పోక్సో కేసు నమోదు

by srinivas |
Kadapa: హాస్టల్ వార్డెన్ భర్త‌కు దేహశుద్ధి.. పోక్సో కేసు నమోదు
X

దిశ, కడప: వైయస్సార్ జిల్లా ఖాజీపేట ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ మంగమ్మ భర్త సుధాకర్ నాయక్‌కు విద్యార్థినుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. సుధాకర్ నాయక్ కొంత కాలంగా హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. మంగళవారం హాస్టల్‌కు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్ భర్తను దేహశుద్ది చేసి ఖాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మైదుకూరు రూరల్ సి.ఐ శ్రీనాథ్ రెడ్డి, ఖాజీపేట ఎస్.ఐ రాజరాజేశ్వర్ రెడ్డి హాస్టల్‌కు చేరుకొని హాస్టల్ వార్డెన్ ను, ముద్దాయి హాస్టల్ వార్డెన్ భర్తను అదుపులో తీసుకుని విచారించారు. విచారణ అనంతరం హాస్టల్ వార్డెన్ భర్త‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తెలిపారు. బాధిత పిల్లలను ఖాజీపేట పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఆర్.డి.ఓ మధుసూదన్ సైతం విచారణ ప్రారంభించారు.

.


Next Story