- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kadapa: ఉక్కు పరిశ్రమ పునాది రాళ్ళకే పరిమితమా?

దిశ, కడప: కడప ఉక్కు పరిశ్రమ పునాది రాళ్ళకే పరిమైందని డీవైఎఫ్ఐ, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. ప్రభుత్వ రంగంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖ ఉక్కును సైతం పరిరక్షించాలని సూచించారు. ఈ నెల 8న తాము చేపడుతున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాయలసీమను కరువు సీమని ఇంకా ఎన్నేళ్లు చెప్పుకుందామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఎంత కాలం వలసలు వెళ్దామని డీవైఎఫ్ఐ, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు.
కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నా ఎందుకు నిర్మించడం లేదని డీవైఎఫ్ఐ, విద్యార్థి సంఘాల నాయకులు నిలదీశారు. ఉక్కు పరిశ్రమకు ముగ్గురు ముఖ్యమంత్రులు మూడుసార్లు శంకుస్థాపనలు చేశారని, నాలుగు పునాదిరాళ్ళు వేశారని గుర్తు చేశారు. కనీసం రూ. 300 కోట్ల రూపాయలు కూడా నిధులు కేటాయించకుండా ఉక్కు పరిశ్రమ ఎలా నిర్మాణమవుతుందని ప్రశ్నించారు. రాయసీమలో వానలు తక్కువగా కురవచ్చు కానీ, ఖనిజ సంపద వనరులు విరివిగా ఉన్నాయన్నారు. వాటి ద్వారా పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.