- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap News: కరవు కోరల్లో సీఎం జగన్ సొంత జిల్లా

దిశ,కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తప్ప రైతు సమస్యలు పట్టడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు తీవ్రస్థాయిలో విమర్శించారు. కరవు, వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారిన ఆయన సొంత జిల్లా కడప జిల్లా మరోమారు కరువు వాత పడిందన్నారు. భూమిలో వేసిన ఎరువులు విత్తనాలు బుగ్గిపాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం కడప జిల్లాలోని మండలాలను కరవు జాబితాలో చేర్చి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లేదంటూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికారిక బస్సు యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త కరవు పర్యటనలో భాగంగా సోమవారం కమలాపురం మండలం చదిపిరాళ్ళ, ఎర్రగుంట్ల మండలం దండుపల్లి, సిరాజుపల్లె, వామి కొండ రిజర్వాయర్, గ్రామాల్లో సీపీఐ బృందం పర్యటించింది. ఈ సందర్బంగా జి ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కాలేదని, దీంతో ఖరీఫ్,రబీ సీజన్లు పూర్తిగా సాధారణ సాగు విస్తీనానికి నోచుకోలేదన్నారు. అర, కోరగా వేసిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయన్నారు. రైతాంగం కరవు కోరల్లో చిక్కి శల్యమవుతుంటే ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి దుష్ట రాజకీయాలను నడుపుతున్నారని జి ఓబులేసు మండిపడ్డారు. రాష్ట్రంలో 443 మండలాల్లో కరవు ఏర్పడినట్లు ప్రాథమిక అంచనా నివేదికలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం కేవలం 103 కరువు మండలాలు ప్రకటిస్తే అందులో కడప జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా చేర్చకపోవడం, జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రాజెక్టుల్లో ఆరకొరగా నీళ్లు ఉన్నప్పటికీ పంట కాలువలు పూర్తి కాకపోవడంతో వినియోగించుకునే వెసులుబాటు కూడా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు తెలిపారు.