- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Badvel: చంద్రబాబు పర్యటనలో హైటెన్షన్.. పోలీసుల జోక్యంతో ప్రశాంతం
దిశ, కడప ప్రతినిధి: టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు దళితులను కించ పరుస్తూ మట్లాడుతున్నారని బద్వేలులో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే దళితులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లు, నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు గంట పాటు నాలుగురోడ్ల కూడలిలోనే బైఠాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటా హుటినా సంఘటనా స్థలానికి చేరుకొని ఎమ్మెల్యేతో చర్చించారు.
చంద్రబాబు నాయుడు తెలుగుదేశంపార్టీ బద్వేలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని నాలుగు రోడ్ల కూడలి మీదుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పర్యటనకు బయలు దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ వెంటే బందోబస్తుగా ఉండి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. అదే సమయంలో నాలుగు రోడ్ల కూడలిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే వర్గీయులు చంద్రబాబు కాన్వాయ్‌లోకి దూసుకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అలాగే తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా బెలూన్లు పట్టుకుని చంద్రబాబు జై అంటూ ధీటుగా నినాదాలు చేస్తూ కాన్వాయ్ వెంబడి వెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు అప్రమత్తం కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోక పోవడంతో పోలీసులు, ప్రజలు ఊపిరీ పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి: Nellore: జగన్ మామయ్యా మా స్కూలు మాకు కావాలి: విద్యార్థులు