kadapa: వివాహేతర సంబంధం.. స్నేహితుడి చేతులో వాలంటీర్ హతం..!

by srinivas |   ( Updated:2023-11-12 13:31:42.0  )
kadapa: వివాహేతర సంబంధం.. స్నేహితుడి చేతులో వాలంటీర్ హతం..!
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎల్ఐసీ కార్యాలయంలో దారుణం జరిగింది. భవానీశంకర్ అనే వ్యక్తిని తోటి స్నేహితుడు మల్లికార్జున్ చంపేశారు. మృతుడు భవానీ శంకర్ కడప 14వ డివిజన్ వాలంటీర్‌గా పని చేస్తున్నారు. వాలంటీర్‌గా పని చేస్తూనే స్థానిక ఎల్ఐసీ మెయిన్ ఆఫీసులోనూ ఉద్యోగం చేస్తున్నారు. భవానీ శంకర్, మల్లికార్జున్ చిన్ననాటి నుంచి స్నేహితులు. వివాహేతర సంబంధం విషయంలో ఇటీవల వీరి మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో భవానీశంకర్‌కు మల్లికార్జున్ ఫోసి ఎల్ఐసీ కార్యాలయం వద్దకు రావాలని సూచించారు. ఈ మేరకు భవనీశంకర్ ఎల్‌ఐసీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న మల్లికార్జున్.. భవానీ శంకర్ వెళ్లిన వెంటనే తలపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో భవానీ శంకర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మల్లికార్జున్ అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిలో అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు.


Next Story