జగన్‌ ప్లాన్ ఇదే.. విజయసాయి రాజీనామాపై YS షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
జగన్‌ ప్లాన్ ఇదే.. విజయసాయి రాజీనామాపై YS షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) నేత విజయసాయిరెడ్డి రాజీనామా(Vijayasai Reddy resignation)పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్(Andhra Pradesh Congress) అధ్యక్షురాలు షర్మిల(YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్‌ అనుమతి లేకుండా, జగన్‌కు సమాచారం ఇవ్వకుండా విజయసాయిరెడ్డి రాజానామా చేయరు అని అన్నారు. వైసీపీని విజయసాయిరెడ్డి వీడాడంటే అది చిన్న విషయం కాదని తెలిపారు. ఎన్నికల నుంచి ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకు వస్తున్నారని అన్నారు. విజయసాయిరెడ్డి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఇప్పటికైనా అసలు నిజాలేంటో ఆయన బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వ్యూహాత్మకంగా జగన్ మోహన్ రెడ్డే(Jagan Mohan Reddy) విజయసాయిని బీజేపీ(BJP)లోకి పంపుతున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. విజయసాయి రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్కర్(Rajya Sabha Chairman Jagdeep Dhankar) ఆయన రాజీనామాను ఆమోదిస్తూ శనివారం బులిటెన్ విడుదల చేశారు. కాగా, వైసీపీ ముఖ్య నాయకుడు విజయసాయి రెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం ఢిల్లీకి వెళ్లి తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్కర్‌కు ఇచ్చారు. దీంతో విజయసాయి రాజీనామాకు ఆయన ఆమోదం తెలిపారు.



Next Story

Most Viewed