జగన్ వల్ల కష్టాలు పడిన విజయసాయి... సంచలన విషయాలు చెప్పిన షర్మిల

by srinivas |
జగన్ వల్ల కష్టాలు పడిన విజయసాయి... సంచలన విషయాలు చెప్పిన షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan Mohan Reddy) వల్ల చాలా కష్టాలు పడినట్లు విజయసాయిరెడ్డి(Vijaysai Reddy) తనకు చెప్పారని వైఎస్ షర్మిల(Ys Sharmila) తెలిపారు. విజయసాయిరెడ్డి వైసీపీ(Ycp)ని వీడటంపై స్పందించిన ఆమె.. సోదరుడు జగన్‌పై సంచలన వ్యా్ఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డితో తనపై బలవంతంగా ఆరోపణలు చేయించారని షర్మిల చెప్పారు. జగనే ప్రెస్ మీట్ పెట్టించి మరీ తనపై అబద్ధాలు చెప్పించారని ఆమె తెలిపారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి(Yv Subbareddy) మాటలు అసత్యాలు అని విజయలక్ష్మి(VijayaLaxmi) కూడా తనతో చెప్పినట్లు షర్మిల పేర్కొన్నారు. మరోసారి ప్రెస్ మీట్ పెట్టలేదని విజయసాయిరెడ్డిపై జగన్ మండిపడ్డారని, ఆయన ఒప్పుకోకపోవడంతో సుబ్బారెడ్డితో మాట్లాడించారని షర్మిల స్పష్టం చేశారు. తన క్యారెక్టర్‌పై నీచంగా మాట్లాడించారని మండిపడ్డారు. మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ కుట్రలు చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story