మీ ప్రేమ నన్ను ముగ్ధుడ్ని చేసింది: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరణపై ప్రిన్స్ మహేశ్ బాబు

by Seetharam |
మీ ప్రేమ నన్ను ముగ్ధుడ్ని చేసింది: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరణపై ప్రిన్స్ మహేశ్ బాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ గురునానక్ కాలనీలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆయన తనయుడు, ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించారు. తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణగారు వదిలి వెళ్లిన ఘనమైన చరిత్రకు ఇది నివాళి వంటిది అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మహేశ్ బాబు ప్రకటన విడుదల చేశారు. ‘విజయవాడలో కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరించడం పట్ల కమలహాసన్ సర్ కు, దేవినేని అవినాశ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నాన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. నాన్న గారు వదిలి వెళ్లిన ఘనమైన చరిత్రకు ఇది నివాళి వంటిది. ఈ విగ్రహావిష్కరణకు తోడ్పాటు అందించిన అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమ నన్ను ముగ్ధుడ్ని చేసింది’అంటూ మహేశ్ బాబు ఆ ప్రకటనలో వెల్లడించారు. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని శుక్రవారం ఉదయం పద్మభూషణ్ కమలహాసన్, విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌లు ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

సాహసాలకు కేరాఫ్ అడ్రస్: మంత్రి ఆర్‌కే రోజా

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్‌లో సాహసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు అని మంత్రి ఆర్‌కే రోజా కొనియాడారు. వెండితెరపై చెరగని ముద్ర వేసిన దివంగత కృష్ణ విగ్రహాన్ని విజయవాడ కేడీజీవో పార్క్ లో హీరో కమలహాసన్ ఆవిష్కరించడం ఎంతో అభినందనీయమన్నారు. వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కృష్ణ అభిమానులతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారని మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు.

Advertisement

Next Story