ఇన్‌ష్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దలను కాదని ట్రాన్స్ జెండర్ పెళ్లి చేసుకున్న యువకుడు

by Mahesh |   ( Updated:2024-01-25 04:24:30.0  )
ఇన్‌ష్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దలను కాదని ట్రాన్స్ జెండర్ పెళ్లి చేసుకున్న యువకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌ష్టాగ్రామ్‌లో పరిచయమైన ట్రాన్స్ జెండర్ తో ప్రేమలో పడ్డ యువకుడు ఇంట్లో వాళ్లను కాదని పెళ్లి చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని విస్సన్న పేటకు చెందిన యువకుడు, ఖమ్మం జిల్లాకు చెందిన నక్షత్ర అనే ట్రాన్స్ జెండర్ ను ఇన్‌ష్టాగ్రామ్‌ వేదికగా కలుసుకున్నాడు. వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంట్లో చెప్పారు. కానీ యువకుడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో వీరిద్దరు దీంతో లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Next Story

Most Viewed