- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీది శునకానందం.. టీడీపీ నేతల గృహనిర్బంధం సరికాదు : అచ్చెన్నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల మనిషి అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తన జీవితమంతా ప్రజాసేవకేఅంకితమైన గొప్ప వ్యక్తిని జగన్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాడు అని ఆరోపించారు. చంద్రబాబు నిర్ధోషిగా బయటకు రావాలని భగవంతుని ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. వారు ఏం తప్పు చేశారని గృహ నిర్బంధాలు చేస్తున్నారు? అని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేవుడికి బాధలు చెప్పే స్వేచ్ఛ కూడా ఈ దుర్మార్గుడి పాలనలో లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలి? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్ట్ సమయం నుండి టీడీపీ నేతలను గృహనిర్భంధం చేస్తూనే ఉన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అరాచకాలు బయటపడతాయని భయమా? మా వాళ్ళు చేసిన తప్పేంటి? ఎక్కడైనా విధ్వంసాలకు, చట్ట వ్యతిరేకం కార్యాకలాపాలకు పాల్పడ్డారా.? పోలీసులు కూడా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. హద్దులు దాటి అణచివేతకు గురి చేస్తున్నారు అని విరుచుకుపడ్డారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి శునకానందం పొందుతున్న వైసీపీ నేతల మాటల్ని పోలీసులు వినొద్దు అని సూచించారు. చంద్రబాబు కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా రోడ్డుపైకి వస్తుంటే అడ్డుకోవడం దేనికి సంకేతం? ఎన్నికలు దగ్గర పడుతున్నా రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేస్తామంటే చూస్తూ ఊరుకోము. టీడీపీ నేతలను గృహ నిర్భంధాలు చేయడం ఇకనైనా మానుకోవాలి అని అచ్చెన్నాయుడు హితవు పలికారు.
Read More..
చంద్రబాబు జైల్లో మగ్గుతుంటే అన్నం తినబుద్ధి కావడం లేదు : బండ్ల గణేశ్