‘నా కల’ పేరుతో ఎన్నికల ప్రచారం.. జై జగన్ నినాదంతో దద్దరిల్లుతున్న ‘సిద్ధం’ సభ

by srinivas |
‘నా కల’ పేరుతో ఎన్నికల ప్రచారం.. జై జగన్ నినాదంతో దద్దరిల్లుతున్న ‘సిద్ధం’ సభ
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ కొనసాగుతోంది. ఈ సభకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ర్యాంపుపై నడుస్తూ ప్రజలకు సీఎం జగన్ అభివాదం తెలిపారు. మరోవైపు ఈ సభకు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా పోటెత్తారు. సీఎం .. సీఎం అంటూ చేసిన నినాదాలతో సభ దద్దరిల్లుతోంది. మరికాసేపట్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో సీఎం జగన్ ఏం విమర్శలు చేస్తారనేది చర్చనీయంశంగా మారింది.

Next Story

Most Viewed