- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈసీకి వైసీపీ మరోసారి ఫిర్యాదు
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : మున్సిపల్ పదవులకు ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలకు పాల్పడుతోందంటూ ఎన్నికల కమిషన్ కు వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది.పార్టీ ప్రతినిధుల బృందం ఇవాళ విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్సీతో పాటు వివిధ ప్రాంతాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ఘటనలపై గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఈసీని కలిసిన వారిలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, సెంట్రల్ ఇన్ చార్జి మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్, స్టేట్ సెక్రటరీ నారాయణ మూర్తి, లీడ్ క్యాప్ మాజీ చైర్మన్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Next Story