- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics:‘వైసీపీ పాలన ఒక కేస్ స్టడీ’..సీఎం చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల సంక్షేమం పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అయితే ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు గత వైసీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో బాధపడని వర్గం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు.
వైసీపీ ఐదేళ్ల పాలన ఒక కేస్ స్టడీ అని తెలిపారు. జున్ 4వ తేదీన వచ్చిన ఎన్నికల ఫలితాలు వైసీపీ మీద ప్రజా వ్యతిరేకతను బయట పెట్టిందని చెప్పారు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని కలను చంపేశారన్నారు. 72 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. వైసీపీ దోపిడీని ప్రజలకు తెలిపేందుకే కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ఇసుక, మద్యం వంటి విభాగాల ద్వారా తీవ్ర అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంపదను దోచుకున్నారని తెలిపారు.