- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీడీపీలో చేరిన వైసీపీ రెబల్ ఎంపీ RRR
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీలో చేరారు. శుక్రవారం నరసాపురంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు ఎంపీ ఆర్ఆర్ఆర్‌కు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం చంద్రబాబే అన్నారు. జూన్‌లో ప్రభంజనం రాబోతోందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలనలో ఏమైనా సాధించారా అని ప్రశ్నించారు. యువకుల జీవితాలను అంధకారం చేశారని మండిపడ్డారు. ఆయన పాలనలో అన్ని వర్గాలు నాశనం అయ్యాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story