- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇదే.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ
దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడికత్తి జగన్ అని పిలవాల్సింది ఆయనేమో ముఖ్యమంత్రి అయ్యారని.. శ్రీను కోడికత్తి శ్రీనుగా మిగిలిపోయాడని పేర్కొన్నారు. హత్యా యత్నం కూడా కాదు..కేవలం హత్యా ప్రయత్నం చేసినట్టు జరిగిన జగన్నాటకంలో ఓ పాత్రను పోషించినందుకు శ్రీనుకు 5 సంవత్సరాలు బెయిల్ రాకుండా జైల్లో పెట్టడం అన్యాయమని.. అతి దారుణమని పేర్కొన్నారు.
ఇక జైల్లోనే శ్రీను డిగ్రీ కూడా పూర్తి చేశారని తెలిపారు. శ్రీనుకి బెయిల్ మంజూరు కాకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆపాలని చూసిన.. జగన్ కోర్టుకి హాజరు కాకపోయినా.. న్యాయస్థానాలపైన ప్రజలకున్న నమ్మకాన్ని ఇంకా పెంచేలా కోర్టు సంచలన తీర్పుని ఇస్తూ శ్రీనుకి బెయిల్ మంజూరు చేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలు బెయిల్ రాకపోవడం దురదృష్టకరం అని.. అయితే ఇంకా పొడిగించకుండా ఇప్పటికైనా బెయిల్ రావడం హర్షించదగిన విషయం అన్నారు.
ఏ స్థాయి వారైనా న్యాయాన్ని కొంతకాలం ఆపగలరు కానీ.. న్యాయాన్ని సమాధి చెయ్యలేరు అని ఈ రోజు ఉదయం ప్రజలకు తెలిసి వచ్చింది వెల్లడించారు. ఓ వైపు నేడు ఢిల్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులు ఆంధ్రాభవన్ లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని.. మరో వైపు ఈ రోజే కోడికత్తి శీనుకి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం చాల సంతోషించదగిన విషయం అని హర్షం వ్యక్తం చేసారు. ఇలా బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ లాగ అన్ని ఒక్కసారే జరగడం యాదృచ్ఛకమా..? లేక ఇంకేమన్నానా..? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.