- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ ఆస్తుల వ్యవహారంలో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ ఆస్తుల వ్యవహారంలో ఇందూ-హౌసింగ్ బోర్డు కేసులో సుబ్బారెడ్డిపై స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొంది. అంతేకాకుండా ఈ కేసును కింది కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఇప్పుడు ఈ కేసును కొట్టివేస్తే కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లు అవుతుందని స్పష్టం చేసింది. అందువల్ల వైవీ పిటిషన్‌ను అనుమతించమని తెలంగాణ హైకోర్టు తీర్పు నిచ్చింది.
కాగా జగన్ ఆస్తుల వ్యవహారంలో ఇందూ-హౌసింగ్ బోర్డు కేసులో వైవీ సుబ్బారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి హౌసింగ్ ప్రాజెక్టులు అప్పగించారు. అయితే ఈ ప్రాజెక్టులు అప్పగించడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రభావితం చేసి గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టులో 50 శాతం వాటా దక్కించుకున్నారని వైవీ సుబ్బారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. గచ్చిబౌలిలో 4.29 ఎకరాల హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి వసంత ప్రాజెక్ట్స్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య ఒప్పందం కుదుర్చున్నారు. ఈ మేరకు వసంత ప్రాజెక్ట్స్, ఇందూ ప్రాజెక్టుకు ఉన్న 51 శాతం వాటాను సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్‌లకు బదలాయించారు. అంతేకాదు వైవీ సుబ్బారెడ్డికి 50 శాతం, కృష్ణ ప్రసాద్‌కు 1 శాతం వాటా కేటాయించారు. ఇందుకు పత్రిఫలంగా శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన చిడ్కో కంపెనీకి కూకట్ పల్లి హౌసింగ్ ప్రాజెక్ట్స్ అదనంగా 15 ఎకరాలను అప్పటి వైఎస్ ప్రభుత్వం కేటాయించింది.
అయితే ఎలాంటి చెల్లింపలు లేకుండా రూ. 25.42 కోట్ల ప్రాజెక్టులో వైవీ సుబ్బారెడ్డి 50 శాతం వాటా పొందారు. దీంతో సుబ్బారెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 48 మంది సాక్ష్యులు, 46 డ్యాక్యుమెంట్లతో పాటు అభియోగ పత్రాలను తెలంగాణ కోర్టుకు సీబీఐ సమర్పించింది. వైవీ సుబ్బారెడ్డిపై స్పష్టమైన ఆధారాలు ఉండటంతో కింది కోర్టులోనే తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read More..
పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఇంటికి పవన్ కళ్యాణ్