నూతన గవర్నర్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ

by Javid Pasha |
నూతన గవర్నర్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఇటీవలే నియమితులైన జస్టీస్ అబ్దుల్ నజీర్‌ను న్యూ ఢిల్లీలోని ఆయన నివాసంలో మంగళవారం వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన గవర్నర్‌గా నియమితులైనందుకు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. న్యాయ వ్యవస్థలో ఆయనకున్న అపారమైన అనుభవం రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు కలగజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అబ్దుల్ నజీర్ పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న బీబీ హరిచందన్ సేవలను విజయసాయిరెడ్డి కొనియాడారు. బీబీ హరిచందన్ అపార అనుభవం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి ఎంతో మేలు కలుగజేస్తుందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయ సాయిరెడ్డి ఆకాంక్షించారు.



Next Story

Most Viewed